( SPREAD NEWS)AMRAVATEY;- రైతు భరోసా ఓపెనింగ్ కార్యక్రమం నుంచి, నెల్లూరు జిల్లా, కోవూరు మండలం, వేగూరు గ్రామం, ఆమారి బాబు, మాట్లాడుతూ 2019 అక్టోబరు 15 వ తేదీ ఈ రైతు భరోసా కార్యక్రమం మా నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభించడం మాకు గర్వకారణంగా ఉంది. మీరు వస్తూ వస్తూ ఆ రోజు వర్షం తెచ్చారు. ఆ రోజే మాకు అర్ధమైంది ఇది రైతు రాజ్యమని. నెల్లూరు జిల్లా రైతుల కోసం ఈ రైతు భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారని మా రైతులంతా ధీమాగా ఉన్నాం. ఏప్రిల్ – మే నెలలో మేం ఎడగారి సీజన్ వరి పెడతాం. మీరు మాకు ఈ సీజన్‌లో రైతు భరోసా అందించడం, మరలో రెండో దఫా ఇవ్వడం, జనవరిలో మూడో దఫా ఇవ్వడం మా నెల్లూరు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.
నాకు రూ.13,500 రైతు భరోసా రెండు సంవత్సరాల నుంచి పడుతుంది. గతంలో దళారీల మీద విత్తనాలకోసం ఆధారపడేవాళ్లం. మంచి క్వాలిటీ విత్తనాలు మేం రైతు భరోసా డబ్బులతో తెచ్చుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న ఆర్ధికఇబ్బందుల్లో రైతు భరోసా డబ్బులు పడతాయనుకోలేదు, కానీ ఏ రైతు ఇబ్బంది పడకూడని మీరు మాకు ఈ డబ్బులు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. రైతులు ఎలాంటి ఇబ్బంది పడకూడదని, మా చెంతనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా ఉపయోగకరంగా ఉంది.
గతంలో పంటలకు ఏ వ్యాధి వచ్చిందో తెలిసేది కాదు, కానీ ఇప్పుడు నేరుగా సైంటిస్టులను తీసుకొచ్చి మాకు అవసరమైన సలహాలు ఇస్తున్నారు. ఈ క్రాప్ మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పంటలకు ఉచిత భీమా, నష్టపరిహారం చెల్లింపులు, సున్నా వడ్డీ రుణాలు అన్నీ ఈ క్రాఫ్ వల్ల నేరుగా లబ్దిదారులకు మేలు జరుగుతుంది. దళారీల ప్రమేయం పోతుంది. నిజమైన రైతులకు దీని వల్ల మేలు జరుగుతుంది. మా గుండెల్లో మీరు ఎప్పుడూ ఉంటారు సర్.