కిక్కు కోసం దొంగతనాలా

     


 ( SPREAD NEWS);- మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడా వీడిదొంగతనాలు ఎందుకో తెలుసా కిక్కు కోసం.షాక్ అయ్యారా నిజం.నాలుగు నెలలకొకసారి 'కిక్కు' కోసం చోరీలు చేస్తుంటాడు.ఒంటరి మహిళలే  టార్గెట్.కల్లు తాగిస్తాడు. ఆ తర్వాత తన బండిపై ఎక్కించుకుని శివారు ప్రాంతాలకు తీసుకెళతాడు. అక్కడ అత్యాచారం చేసి కోరిక తీర్చుకుంటాడు. ఆపై నగలు, డబ్బుతో ఉడాయిస్తాడు. అయితే వారికి ఎలాంటి హానీ చేయడు.

      రాక్షసుడి పేరు హుస్సేన్‌ఖాన్‌మనిషి రూపంలో ఉన్న ఆ రాక్షసుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.హుస్సేన్ క్రైమ్ స్టోరీ తెలుసుకుని పోలీసులే షాక్.చోరీలు, అత్యాచారాలు చేయడం వల్ల తనకు ఎక్కడ లేని మజా వస్తుందని, ఇప్పటివరకు 19 మంది మహిళలను ఈ తరహాలో వంచించినట్లు హుస్సేన్‌ఖాన్ చెప్పడంతో రాచకొండ పోలీసులు కంగుతిన్నారు. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయేఎన్నో అంశాలు . గురువారం మే 13,2021 అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

    2006లో తొలిసారిగా మరో వ్యక్తితో కలిసి సైఫాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల మ్యాన్‌ప్యాక్‌(పోలీసుల చేతిలో ఉండేది)ను చోరీ చేశాడు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమంటూ ప్రేమికులను బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. సైఫాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. కల్లు దుకాణాల దగ్గర ఉండే మహిళలను ఎవరూ పట్టించుకోరని దృష్టి పెట్టాడు.కాగా 19 మంది మహిళల్లో ఇద్దరే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేలింది. 'నేను కేవలం కిక్కు కోసమే చేశా.

     కుమారుడి పేరు మీద రిజిస్టర్‌ అయిన బైక్ పై హుస్సేన్‌ఖాన్‌ బయలుదేరుతాడు. ఇంటి నుంచి బయటకు రాగానే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తాడు. అంటే ఆ రోజు ఏదో నేరం చేయబోతున్నాడని కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు. మళ్లీ ఇంటికొచ్చిన తర్వాతే ఫోన్‌ ఆన్‌ చేస్తాడు. సాయంత్రం మాత్రమే మహిళలను బండిపై ఎక్కించుకుంటాడు. ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్లకు సమీపంలోని పొదల చాటుకు తీసుకెళ్తాడు. ఆభరణాలు తీసి డిక్కీలో వేయమంటూ పురామయిస్తాడు. కోరికలు తీర్చుకున్న తర్వాత అక్కడి నుంచి ఉడాయిస్తాడు.