spread news(amravatey);- వైయస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ మూడో ఏడాది తొలి విడత చెల్లింపులు క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.
మన్నాల పెద్దక్క, మహిళా రైతు, అనంతపురం జిల్లా.
మరో 30 యేండ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుతున్నాను.రైతు భరోసా నుంచి రూ.13,500 జగనన్న సరిగ్గా టైంకు మాకు పంపుతున్నాడు. నాణ్యమైన విత్తనం తీసుకోవాలని కరెక్టు టైంకి పంపిస్తున్నాడు. గతేడాది కూడా మేం నాణ్యమైన విత్తనాలు తీసుకున్నాం. పెట్టుబడి కింద వాడుకున్నాం. వేరుశెనగ పైరు పెట్టిన తర్వాత వలంటీర్లు, అధికార్లు ఎప్పటికప్పడు మాకు తెలియని విషయాలు చెప్పారు. పైరులో ఫోటోలు తీసి మీకు ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పారు. గతేడాది కరోనాతో మేం శెనక్కాయలు అమ్ముకోలేకపోతే ప్రభుత్వమే రూ.6500 ధరతో కొనింది.
పెంకే గోవిందరాజులు, కరప మండలం, తూర్పు గోదావరి జిల్లా.
మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పథకాలు ఇప్పటికీ రైతు గుండెల్లో నిల్చిపోయాయి.ఆయన కుమారుడైన మీరు తండ్రికి తగ్గ తనయుడులా ముందుకు తీసుకుపోతున్నారు.నాకు రెండెకరాలు సొంతపొలం ఉంది. మరో మూడు ఎకరాలు పొలం కౌలుకు చేస్తున్నాను. మూడు విడతల్లో నాకు రైతు భరోసా డబ్బులు అందుతున్నాయి.దీనికి మీకు ధన్యవాదాలు. గతంలో పంట షావుకార్లకు అమ్మాలి. పండించిన పంటను రైతు కొనుగోలు కేంద్రాలు వద్దే నా పంటను ధైర్యంగా అమ్ముకోగలుగుతున్నాను. నా ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయి.