SPREAD NEWS(NELLORE);- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ.ఆనం రామనారాయణ రెడ్డి గారి నెల్లూరు నివాసంలో, ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ. మేకపాటి గౌతమ్ రెడ్డి గారితో మంగళవారం నాడు భేటీ లో భాగంగా, వెంకటగిరి నియోజకవర్గం లో నిరుద్యోగ యువత కోసం, పారిశ్రామిక అభివృద్ధి కొరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మంజూరు చేయాలని ఎమ్మెల్యే శ్రీ ఆనం గారు, మంత్రి శ్రీ. మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని కోరారు.
అందుకు మంత్రి స్పందిస్తూ, వెంకటగిరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు విషయమై నియోజకవర్గంలోని స్థానిక నాయకులతో, సంప్రదింపులు జరిపి స్థల సేకరణ ప్రారంభిస్తామని మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీ. ఆనం గారికి తెలియజేశారు.అదేవిధంగా కండలేరు జలాశయం నుంచి నెల్లూరు జిల్లా లోని ప్రజలకు ఇచ్చే నీటి సరఫరా పైపులైన్ల పనితీరు నాణ్యతతో జరగడం లేదని, దీని మీద విజిలెన్స్ ఎంక్వయిరీ చేయాలని కోరారు.
ఈ పైప్ లైన్ పనులకు సంబంధించి మొత్తం పనులను జెసిపి ఆపరేటర్ లు చేస్తున్నారని అలాగే పరిశ్రమల శాఖకు చెందిన ఏ ఒక్క ఉద్యోగి లేకుండా ఆ కాంట్రాక్టర్ మనుషుల చేత పనులు చేయిస్తున్నారని, ఎమ్మెల్యే శ్రీ ఆనం మంత్రి శ్రీ గౌతమ్ రెడ్డి కి వివరించారు. వెంకటగిరి నియోజకవర్గం లోని పల్లెల మీదుగా వెళ్తున్న నీటి పైప్ లైన్లు నాణ్యత లేకపోవడం వల్ల ఆ ప్రాంత రైతులు, గ్రామస్తులు భయభ్రాంతులకు గురి అవుతున్నారని, ఈ పైప్ లైన్ పనుల నాణ్యతపై తగు విచారణ జరిపించాలని, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ. మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని మాజీ ఆర్థిక మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు, శ్రీ.ఆనం రామనారాయణ రెడ్డి గారు కోరారు.