SPREAD NEWS;- ఆంధ్రప్రదేశ్లో లో కోవిడ్ కలకలం సృష్టిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ కోవిడ్ దెబ్బకు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా కోవిడ్ కలకలం మొదలైంది. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఎవరిని ఈ వైరస్ వదలటం లేదు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆక్సిజన్ కొరత మందుల కొరత బెడ్ ల కొరత వెంటాడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంతో క్లియర్ చేసుకుంటూ పోతుంది. అనేకమంది సేవా దృక్పథంతో సేవలు చేస్తున్నారు. ఇప్పుడు సరికొత్తగా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే భారతి సిమెంట్ సాయం చేస్తూ, కరోనా బాధితుల కోసం 60 లక్షల విలువ చేసేఆక్సిజన్ ట్యాంకు తో పాటు, వైద్య పరికరాలను గుజరాత్ నుంచి కడప రిమ్స్ కు చేరింది. కడప రిమ్స్ హాస్పిటల్ నందు ఆక్సిజన్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేశారు.