కరోనా పాజిటివ్ వచ్చిన వారికి తప్పకుండా మేము తగ్గిస్తాం అని గ్యారంటీ ఇస్తారా!

 


SPREAD NEWS(NELLORE);- కరోనా పాజిటివ్ వచ్చిన వారికి తప్పకుండా మేము తగ్గిస్తాం,ఏ కార్పొరేట్  ఆసుపత్రి కూడా  గ్యాంరంటీఅయినా ఇవ్వగలదా. ఆనందయ్య మాత్రం గ్యారంటీ ఇవ్వాలా.కార్పొరేట్ ఆసుపత్రులలో లక్షలు ఖర్చు చేసినా మనిషినిఇస్తారో, శవాన్నిఇస్తారో, ఎవరైనా గ్యారంటీగా చెప్పగలరా.ఆనందయ్య ఇటువంటి గ్యారంటీ ఇవ్వకపోయినా ఆస్తులను మాత్రం అమ్మించడంలేదు, అప్పులు చేయించడంలేదు. ఇది చాలా మంచిపనే అని జనాలు నమ్ముతున్నరు.

     ఆనందయ్య దగ్గర అంత క్యూ కట్టడానికి, మాత్రం రక్తపు కూడుమరిగిన 98 శాతం కార్పొరేట్ ఆసుపత్రులే అని మాత్రం జనాలు నమ్ముతున్నారు. వైద్యాన్ని వైద్యంగా కాకుండా వ్యాపారంగా మార్చిజలగల్లా,ఆసుపత్రులు పీక్కు తింటుంటే. ఆనందయ్య మాత్రం గ్యారంటీ ఇస్తారా.కరోనా టైమ్ లో చాలా మంది అడుక్కునే వారు సైతం తాము దాచుకున్న డబ్బులతో  ఇతరులకు సహాయం చేశారే.98 శాతం కార్పొరేట్ ఆసుపత్రులు ఈ టైమ్ లో కూడా అంతకంటే దోపిడీ చేస్తుంటే సామాన్య ప్రజలకు ఆనందయ్యే దేవుడు అనడంలో నాకు మాత్రం ఏమాత్రం సందేహం లేదు. 

    ఇప్పటి పరిస్థితుల్లో ఏ ఒక్కడైనా సరేకరోనా సోకితే ఆసుపత్రిలో బెడ్ గ్యారంటీగా గ్యారంటీ ఇవ్వగలరా. ఆక్సిజన్ అందిస్తామని గ్యారంటీ ఇవ్వగలరా, కనీసం మందులైనా ఇస్తామని చెప్పగలరా. మరో ముఖ్యమైన విషయం లక్షల రూపాయలు ఖర్చు పెట్టించే, అప్పుల పాలు చేయించే ఏ కార్పొరేట్ ఆసపత్రులు కూడా ఎటువంటి గ్యారంటీ ఇవ్వరు. కానీ ఆనందయ్య మాత్రమే గ్యారంటీ ఇవ్వాలా.