(SPREAD NEWS)అమరావతి, మే 25 :కృష్ణపట్నం మందు తయారీని ఆయూష్ కమిషనర్ స్వయంగా పరిశీలించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. హైదరాబాద్ ల్యాబ్ కు పంపిన శాంపిళ్ల రిపోర్టులు కొన్ని వచ్చాయని, మరికొన్ని రావాల్సి ఉందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ స్టడీష్, తిరుపతి ఆయుర్వేదిక్ కాలేజీకి చెందిన నిపుణులు కృష్ణపట్నం మందును పరిశీలిస్తున్నారన్నారు
కంటిలో వేసే మందు వినియోగంతో ఎవరికైనా నష్టం కలిగిందా అనే వివరాలు సేకరించాలని ఆయూష్ కమిషనర్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు శుక్రవారం లోగా ఆ మందుపై క్లారిటీ రాబోతోందన్నారు. అదే సమయంలో హైబాదరాబాద్ ల్యాబ్ కు పంపిన శాంపిళ్లపైనా పూర్తి స్థాయిలో రిపోర్టు వచ్చేస్తుందన్నారు.
. సీసీఆర్ఎఎస్ నుంచి వచ్చే నివేదికల ఆధారంగా కృష్ణపట్నం మందుపై మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.