SPREAD NEWS(NELLORE);- జర్నలిస్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్ విజ్ఞప్తి చేశారు .గురువారం నెల్లూరు ప్రెస్క్లబ్లో స్టేట్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన నారద జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఎందరో మృతి చెందారని వారికి సంతాపం ప్రకటించారు.
వివిధ రాష్ర్టాల్లో మృతిచెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం గ్రాంట్ మంజూరు చేస్తున్నా మన రాష్ట్రంలో ఇంకా అలాంటి నిర్ణయం అమలు కావడం లేదని .ఆవేదన వ్యక్తం చేశారు .తక్షణం ప్రభుత్వాలు జర్నలిస్టుల కుటుంబాలకు అన్ని రకాల వసతులు కల్పించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు .కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ ఉషాకిరణ్ మాట్లాడుతూ ప్రస్తుతం జర్నలిస్టుల సమాజానికి దశాదిశా చూపిస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు నయీంఖాన్ నాగరాజు సరస్వతి సుబ్బారావులను ఘనంగా సన్మానించారు .సామ్నా అధ్యక్షులు సర్వేపల్లి రామ్మూర్తి ప్రధానకార్యదర్శి జి .హను కు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో సామ్నా గౌరవాధ్యక్షుడు జీ. శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.