SPREAD NEWS(అమరావతి;-నెల్లూరు, కడప,శ్రీకాకుళం, ఒంగోలు,లోని బోధన ఆస్పత్రులలో సీటీ స్కాన్‌లు, ఎంఆర్‌ఐ సదుపాయాల కల్పన. మొత్తం రూ.67 కోట్ల వ్యయంతో వాటి ఏర్పాటు.రాష్ట్రంలోని 11 టీచింగ్ ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు కేవలం ఏడింటిలో మాత్రమే పీపీపీ విధానంలో వీటి సదుపాయం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన నాలుగు బోధన ఆస్పత్రులు.. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో సీటీ స్కాన్‌లు, కడప మినహా మిగిలిన మూడు చోట్ల ఎంఆర్‌ఐ పరికరాలను సీఎం శ్రీ వైయస్ జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈరోజు రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులలో కేవలం ఏడింటిలో మాత్రమే సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరికరాలు ఉన్నాయి. అవి కూడా పీపీపీ పద్ధతిలో ఉన్నాయి. వాటిలో టెక్నాలజీ, క్వాలిటీ అప్‌గ్రెడేషన్ కూడా లేదు. ఈ పరిస్థితి మారాలని పలు చర్యలు తీసుకుంటున్నాము.కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే ఉన్న 11 టీచింగ్ ఆస్పత్రులను నాడు–నేడు కింద అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, కొత్తగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా టీచింగ్ ఆస్పత్రితో పాటు, నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాటిలో టాప్ ఆఫ్ ది లైన్ డయాగ్నస్టిక్ సర్వీసులు అందించే దృక్పథంతో అడుగులు వేస్తున్నాము.
టీచింగ్ ఆస్పత్రులలో ఆ సదుపాయాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, పథకం లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తాము. ఆ విధంగా డయాగ్నస్టిక్ సేవలు అందిస్తాము. మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు వాటి నిర్వహణ వ్యయం భరిస్తుంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో అప్‌గ్రేడ్‌తో ఆ పరికరాలు, నిరంతరం బాగా పని చేసేలా చర్యలు చేపడుతున్నాము. ఆస్పత్రులను జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాము.వీటికి మూడేళ్ల వారంటీ ఉంది. మరో ఏడేళ్లు సర్వీసు బాధ్యతను ఆ కంపెనీలు నిర్వహిస్తాయి. ఏ పేదవాడికైనా ఉచితంగా సేవలందించేలా, ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రులలో అన్ని సదుపాయాల ఏర్పాటు చేస్తాం.