SPREAD NEWS(అమరావతి);- ఎండకి బెదరలేదు,వానకి వెనుతిరగలేదు, కష్టాలుఎదురైనా, ఓర్పుతోముందుకు అడుగు వేశాడు, నష్టాలను ఎదుర్కొన్నాడు, చివరికి తనే ఒక వెలుగై జన హృదయాలను గెలుచుకున్నాడు. మొదట అతనొక్కడే నాయకుడు, చివరకు అయిదున్నర కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ఎవరైతే కుట్రలకు పన్నాగం పన్నారో ఆ కుట్రలను ఏకధాటిగా ఎదుర్కొన్న నేత. అవినీతి పరుల గుండెల్లో అగ్గి పుట్టించాడు.
అన్ని ప్రతిపక్షాలన్నీ ఏకమైనా గాని వెదరని నేత చివరకు జగన్మోహన్ రెడ్డి అను నేను అని జనాల సాక్షిగా ప్రమాణం చేసిన నేత. ఈ నేత గతం ఒక్కసారి చూసినప్పుడు నల్లమల లోని నల్ల కాలువ పక్కన పావురాల గుంట సభలో లక్షల మంది జనాల మధ్య లో నాన్న నాకు ఒక కుటుంబాన్నిఇచ్చాడు, అందుకే నేను చెబుతున్నా నాన్న కోసం అణువులు పాసిన ప్రతి గుండెను పలకరిస్తా.
నేను మీ చెంతకి వస్తా, ప్రతి గుండెను కదిలిస్తా, నాన్న అభిమానించే ప్రతి మనిషిని పలకరిస్తా, అనే మాట ఆ మాట కోసం ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొని జన నాయకుడిగా ఎదిగాడు. జనం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడే నేతగా మీ ముందుకు వచ్చిన జగనన్నకు జనం మెచ్చిన నేతకు రెండేళ్లు.