అందుకే సాధ్యమైంది

     


SPREAD NEWS(అమరావతి);-   ‘ప్రతి రోజూ 20 వేల కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. నిజానికి అందరూ చాలా బాగా పని చేస్తున్నారు. అందుకే మన దగ్గర టయర్‌–1 సిటీ, ఆ స్థాయిలో ఆస్పత్రులు లేకపోయినా, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. మీరంతా ఆస్పత్రుల్లో బా«ధ్యతను తీసుకోవడమే కాకుండా, ఎంత ఒత్తిడి ఉన్నా చిరునవ్వుతో పని చేస్తున్నారు కాబట్టే ఇది సా«ధ్యమైంది. అదే విధంగా కోవిడ్‌ను కూడా ఎదుర్కోగలుగుతున్నాము. కాబట్టి ఎవ్వరూ సహనం కోల్పోవద్దు. అధికారులు మంచితనంతో పని చేయించుకోవాలని కోరుతున్నాను’..

    అని విజ్ఞప్తి చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఇప్పుడు ఈ మంచి కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంకా మేలు జరగాలని మనసారా కోరుకుంటున్నానంటూ ప్రసంగం ముగించారు.డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.