SPREAD NEWS(అమరావతి);- ఆనందయ్య మందుపై సమీక్షించిన సీఎం. సీసీఆర్‌ఏఎస్ సహా పలు సంస్థలు ఇచ్చిన నివేదికల్లోని అంశాలను ముఖ్యమంత్రికి వివరించిన ఆయుష్ కమిషనర్ వి.రాములు, ఇతర అధికారులు.
అధికారులు ఏమన్నారంటే
ఆనందయ్య మందు వాడితే కోవిడ్ తగ్గిందనడానికి ఆధారాలు లేవు. ఆనందయ్య పి, ఎల్, ఎఫ్, కె, అనే నాలుగు మందులతో పాటు, కంట్లో డ్రాప్స్ వేస్తున్నారు. కాని, మా కమిటీ ముందు ముడిపదార్థాలు లేనందున కె అనే మందు తయారీని చూపించలేదు. పీ, ఎల్, ఎఫ్‌లతో పాటు కంటిలో ఇచ్చే డ్రాప్స్ మాత్రమే చూపించారు.కంటి డ్రాప్స్ కు సంబంధించి కొన్ని రిపోర్టులు రావాల్సి ఉంది. ఆనందయ్య వాడే పదార్థాలు హానికరం కావని నివేదికల్లో చెప్పారు.
ఆనందయ్య మందు కోవిడ్‌పై ఎంతవరకూ పనిచేస్తుందని సీసీఆర్‌ఎఎస్ ట్రయల్స్ చేసింది. ఆనందయ్య మందువల్ల కోవిడ్ తగ్గుతుందనడానికి ఎలాంటి నిర్దారణలు లేవని నివేదికలు స్పష్టంచేశాయి. అలాగే ఆయుర్వేదం అని గుర్తించడానికి కూడా వీల్లేదు.ఆనందయ్య ఆయర్వేదం మందుగా గుర్తించాలని కోరితే, దరఖాస్తు చేస్తే దానిపై చట్ట పరిధిలో పరిశీలనలు చేస్తాం.