ముఖ్యమంత్రికి ప్రధాని ఫోన్‌ – కోవిడ్‌ నివారణా చర్యలపై చర్చ

     


  spread news(అమరావతి);- ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌కు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఫోన్‌చేశారు. కోవిడ్‌ వైరస్‌ విస్తరణ, నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై ఇద్దరూ చర్చించారు. కోవిడ్‌ వైరస్‌ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, అలాగే వైరస్‌ సోకిన వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలపై ముఖ్యమంత్రి, ప్రధానికి వివరించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచి, కోవిడ్‌ బాధితులకు వైద్యం అందిస్తున్నామని, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు.