ఆంధ్రుల కల పోలవరం ప్రాజెక్టు గురించి సీఎం సమీక్ష పాల్గొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్

   


 SPREAD NEWS(అమరావతి);- స్పిల్‌వే కాంక్రీట్‌ పనుల్లో 91 శాతం పూర్తయ్యాయని, జూన్‌ 15 కల్లా మిగిలిన పనులు పూర్తి చేస్తామని వెల్లడి.రేడియల్‌ గేట్లలో 42 బిగించగా, ఇంకా 6 పెండింగులో ఉన్నాయని, వాటిని కూడా వేగంగా బిగిస్తామన్న అధికారులు.జర్మనీ నుంచి మిగిలిన 14 హైడ్రాలిక్‌ సిలిండర్లు కూడా త్వరలోనే ఇక్కడికి చేరనున్నాయని తెలిపిన అధికారులు.ఇప్పటికే బిగించిన అన్ని గేట్లను పూర్తిగా ఎత్తిపెట్టి రాబోయే వరద నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్లు  చేశామన్న అధికారులు.ఈ నెలాఖరు కల్లా స్పిల్‌ ఛానల్‌ పనులు సేఫ్‌ స్టేజ్‌ దశకు చేరుకుంటాయని వెల్లడి.ఎగువ కాఫర్‌ డ్యాంలో అక్కడక్కడ మిగిలిన పనులతో పాటు, వాటికి  సంబంధించి సంక్లిష్టమైన పనులను పూర్తి చేశామని వెల్లడించిన అధికారులు.కాఫర్‌ డ్యాంలోని అన్ని రీచ్‌లను జూన్‌ నెలాఖరు నాటికి 38 మీటర్ల ఎత్తుకు, అలాగే జూలై చివరి నాటికి పూర్తిస్థాయిలో పెంచుతామని సీఎంకు వివరించిన అధికారులు.

పోలవరం అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్డు: సీఎం

    పోలవరం ప్రాజెక్టు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టు అన్న సీఎం. ప్రాజెక్టులో దిగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించిన మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశం.ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలపైనా సమీక్ష.కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా చర్చ.

ఆ తపనతో ముందుకెళ్తున్నాం

    యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే తలంపుతో ప్రభుత్వం ఉంది.అందుకే పనులు ఆగకుండా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి డబ్బులు ఇస్తున్నాం.ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాలనే తపనతో ఉన్నాం.ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్టు పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాం.