మాజీమంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం ముదిరి పాకానపడుతోందా

         


 మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్‌కు మధ్య వ్యవహారం ముదిరి పాకానపడుతోంది.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఈటల రాజేందర్  యోచిస్తుంటే. పార్టీ నుంచి బహిష్కరించాలని టీఆర్ఎస్ దాదాపుగా నిర్ణయానికి  పార్టీ నుంచి బహిష్కరించాలని టీఆర్ఎస్ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు.. ఈటల రాజేందర్‌కు పొలిటికల్‌గా చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.ఈటల రాజేందర్.. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చూపించాలని భావిస్తున్నారు.

    ఇదే అంశంపై అక్కడి అనుచరులతో చర్చలు జరుపుతున్నారు.మరోవైపు ఇదే అంశంపై టీఆర్ఎస్ కూడా గట్టిగానే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్‌లోనే అడ్డుకుంటే.. ఆయన దూకుడుకు కళ్లెం వేయొచ్చనే భావనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలకు టచ్‌లోకి వెళ్లే పనిని ఆ పార్టీ నేతలు మొదలుపెట్టారు.

        టీఆర్ఎస్తోఉంటేనే మేలు అని, ఈటల రాజేందర్‌తో కలిసి నడిస్తే రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని  చెబుతున్నట్టు సమాచారం.కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌కుఈటల రాజేందర్‌కు చెక్ పెట్టే పనిని అప్పగించినట్టు రాజకీయవర్గాల్లో చర్చ.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజూరాబాద్‌లో సత్తా చాటాలని ఈటల రాజేందర్ భావిస్తుంటే.. ఆయన కంటే ముందే ఆపరేషన్ హుజూరాబాద్‌ను టీఆర్ఎస్ మొదలుపెట్టినట్టు సమాఛారమ్.