ఈరోజు రాష్ట్ర ముఖ్య వార్తలు

 ఈరోజు మన రాష్ట్రంలో జరిగిన ముఖ్యవార్తలు చూడండి

   


 spread news(amravathi);-రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు, సేకరణపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్షహాజరైన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), అగ్రికల్చర్‌ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్, సివిల్‌ సప్లైస్‌ వీసీ అండ్‌ ఎండీ ఏ. సూర్యకుమారి, ఇతర ఉన్నతాధికారులు.

కోవిడ్,  నేపథ్యంలో రైతులుపై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నాం, మంత్రి కన్నబాబు

     


వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు మంత్రి కన్నబాబు. తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాయితీపై విత్తనాలు పంపిణి కార్యక్రమం, రబి 2020-21 పంట ఉత్పత్తి కొనుగోలు అంశాల పైన కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు.కర్ఫ్యూ నేపథ్యంలో పరిస్థితులు మారుతున్నాయని కోవిడ్, కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, విజయోగదారుల పై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా చర్యలు, ఎప్పటికప్పుడు పరిస్థితి ని సమీక్షించి చర్యలు చేపట్టాలన్నారు.

పెద్దాసుపత్రుల ఆవరణలో అదనపు బెడ్ల ఏర్పాటురాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి

     


సచివాలయం, మే 6 : నగరాల్లో ఉన్న పెద్దాసుపత్రుల ఆవరణలో కొవిడ్ కేర్ సెంటర్ల మాదిరిగా తాత్కాలిక బెడ్లు ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఒప్పందం ప్రకారం నెట్ వర్క్ ఆసుపత్రులతో పాటు కొవిడ్ చికిత్సల కోసం జిల్లా కలెక్టర్ల అనుమతులు పొందిన ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ సగానికి పైగా బెడ్లు నిండిపోయినా ఆర్యో శ్రీ పథకం వైద్య సేవలు పొందే కరోనా బాధితులకు బెడ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేయనుందన్నారు. 

    రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు రూ. 100 కోట్లు, వాక్సిన్ కోసం మరో రూ.45 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన తెలిపారు. టీచింగ్, ఏరియా, జిల్లా ఆసుపత్రల్లో పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆక్సిజన్ సప్లయ్ కు అవకాశం కలుగుతుందన్నారు. టెండర్లు పిలిచారమని, 3, 4 రోజుల్లో ఖరారుల చేసి, పనులు త్వరగా ప్రారంభించి, 3,4 నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జ్వరపీడితులను గుర్తించడానికి చేపట్టిన మొదటి విడత ఇంటింటి సర్వే ఇప్పటికే సర్వే పూర్తి.