SPREAD NEWS;- టిడిపి నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డాక్టర్ల పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్.మేము మా ప్రాణాలను పణంగా పెట్టి ప్రతి ఒక్కరికి వైద్యం చేస్తూ ఉంటే మీరు మీ రాజకీయ లబ్ధి కోసం డాక్టర్లను దొంగలు, దోపిడీ దారులుగా చిత్రీకరించడం మానుకోవాలి రాజకీయ విబేధాల్లోకి తమను రానివ్వొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా శాఖ ప్రతినిధులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శ్రీనివాసతేజ, డాక్టర్ ప్రసాద్ అన్నారు. తమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, ప్రజల ప్రాణాలు వారి ఆరోగ్యమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. డాక్టర్లకు రాజకీయ రంగు పులమొద్దని కోరారు. తమ పనిని ప్రశాంతంగా చేసుకోనివ్వండని టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు.