SPREAD NEWS(అమరావతి);- రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 14 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు శంకుస్థాపన.
క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శిలాఫలకాలు ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్ జగన్.విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, పిడుగురాళ్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో వైద్య కళాశాలలకు శంకుస్ధాపన.
కృష్ణవేణి, విజయనగరం జిల్లా
ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరుపున మీకు చెప్తున్నాను. వైద్య రంగానికి మీరు చెప్తున్న మాటలు విన్నాను... ఇంతవరకు వైద్యో నారాయణో హరీ అనేవాళ్లం.. ఇప్పుడు జగనన్న నారాయణో హరీ అంటాం.
డాక్టర్ శరత్ చంద్ర, పిడుగురాళ్ల, గుంటూరు జిల్లా
మెడికల్స్ హబ్స్ అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, అభివృద్ధిని వికేంద్రీకరణ దిశగా తీసుకెళ్తున్నారు. ప్రైమరీ హెల్త్ కేర్ దగ్గర నుంచి టెరిషియరీ హెల్త్ కేర్ వరకు కూడా మీకున్న విజన్ చాలా అద్భుతం.ఇది ఆంధ్రరాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం.
జయలక్ష్మి, అనకాపల్లి, విశాఖపట్టణం జిల్లా
104 కి కాల్ చేస్తే... నా భర్త వివరాలు తీసుకుని ఆసుపత్రిలో తీసుకెళ్లి చికిత్స అందించారు. నా మాంగళ్యం నిలబడింది అంటే మీ వల్లే అన్నా.మీ వల్ల, మా అనకాపల్లిలో ఇంత పెద్ద ఆసుపత్రి నిర్మించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం.
రాధ, ఎర్రమంచి గ్రామం, పెనుకొండ, అనంతపురం జిల్లా
మా కోనసీమ చూసి అందరూ బాగుంది, బాగుంది అంటారు కానీ, ఇటువంటి ఆలోచన ఏ ప్రభుత్వానికి రాలేదు. మీకు ఆ ఆలోచన వచ్చి ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషం.