దేశవ్యాప్తంగా రికవరీ రేటు సగటు 96.59శాతం, ఏపీలో 96.67శాతం

 కోవిడ్‌పై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

     


 SPREAD NEWS(అమరావతి);- 50వేల దిగువకు యాక్టివ్‌ కేసులు,పాజిటివిటీ రేటు 5.23 శాతం.6 జిల్లాల్లో 5 కంటే తక్కువ పాజిటివిటీ రేటు,కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాలలో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు.జాతీయ సగటు కంటే అధికంగా రికవరీ రేటు.దేశవ్యాప్తంగా రికవరీ రేటు సగటు 96.59శాతం, ఏపీలో 96.67శాతం.ప్రయివేటు ఆస్పత్రుల్లో అక్యుపై అయిన పడకల్లో 76.51శాతం పడకల్లో రోగులకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స.104కు గణనీయంగా తగ్గిన  కాల్స్, జూన్‌ 25న కేవలం 1021 కాల్స్‌.

బ్లాక్‌ ఫంగస్‌

బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 3148, 1095 మందికి సర్జరీలు.

మరణాలు 237,మిగిలిన వారికి కొనసాగుతున్న చికిత్స.

ఆక్సిజన్‌ ప్లాంట్లు

రాష్ట్ర వ్యాప్తంగా 134 ఆక్సిజన్‌ జనరేషన్‌(పీఎస్‌ఎ) ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు

50 అంతకంటే ఎక్కువ పడకలున్న ఆస్పత్రుల్లో జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు

సెప్టెంబరు నాటికి 97 ప్లాంట్లు ఏర్పాటవుతాయన్న అధికారులు

మిగిలిన 37 ప్లాంట్లు రానున్న మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడి