SPREADNEWS(NELLORE)'- ప్రపంచపర్యావరణ దినోత్సవ సందర్భముగా, వి యస్ యు లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆసరా మరియు వెల్ఫేర్ శ్రీ టి బాపి రెడ్డి గారు ముఖ్య అతిధిగా, డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై కె షణ్ముఖ కుమార్ గారు, విశిష్ట అతిధులుగా పాల్గొని వి ఎస్ యు ప్రగణం ఔషధ వనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా టి బాపి రెడ్డి గారు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడే విధంగా పరిశోధనలు చేపట్టాలని కోరారు
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఎల్.విజయ క్రిష్ణ రెడ్డి గారు, మాట్లాడుతూ భవిష్యత్తులో విశ్వవిద్యాలయం పచ్చదనం తో నిండాలని కోరారు ప్రతిఒక్కరు వారి వారి గ్రామంలో అలాగే వారి ఇళ్లలో కూడా మొక్కలను నాటాలని అలాగే పక్షులకు ఉపయోగపడే పండ్ల మొక్కలను కూడా నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై కె షణ్ముఖ కుమార్ గారు, మాట్లాడుతూ సామాన్య ప్రజలందరికి పర్యావరణ సమతుల్యత మీద అవగాహనా కల్పించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ప్రజలందరూ ఏదో ఒక మొక్కను వారి వారి ఇళ్లలో నాటాలని విజ్ఞప్తి చేశారు. శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డా. మోపూరు భాస్కర్ నాయుడు గారు, ఖర్జూరపు చెట్లను బహుకరించారు. విశ్వవిద్యాలయంలో పచ్చదనం పెంపొందించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ యస్ యస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం గారు, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ శ్రీ ఏ మహేంద్ర రెడ్డి గారు, డా. కె సునీత గారు,డా ఆర్. మధుమతి గారు,డా సిచ్. కిరణ్మయి గారు, డా. నీల మణికంఠ, డా ఏ.ప్రవీణ్ కుమార్ గారు, ఎన్ యస్ యస్ సిబ్బంది షేక్.ఉస్మాన్ అలీ గారు, మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.