ఏపీ ప్రజలకు శుభవార్త

 అవినీతి, వివక్షతకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ

 4 నెలల్లోనే 1.22 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు


    SPREAD NEWS(అమరావతి);‍- ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియని స్థితిలో కోచింగ్ జరుగుతూ ఉంటే, ఒక్కోసారి పిల్లలకు మనోధైర్యం కోల్పోయే పరిస్థితి ఎదురవుతూ ఉండేది. ఈ పరిస్థితులను మారుస్తూ, వచ్చే తొమ్మిది నెలల కాలంలో అంటే జూలై నుంచి మార్చి 2022 వరకు ఏఏ ఉద్యోగాలు, వాటికి ఏ నెలలో మనందరి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ ఇవ్వబోతోందనే దానిపై జాబ్ క్యాలెండర్‌ను ఈ రోజు విడుదల చేస్తున్నాం.

    ఈ వచ్చే తొమ్మిది నెలల కాలంలో, అంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 10,143 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం.. ఈ క్యాలండర్ ఎందుకు ఇంత ప్రాధాన్యత కలిగి ఉంది, ఎందుకు ఇంత అవసరమూ అని అంటే, చదువులు పూర్తి చేసుకున్న చెల్లెమ్మలు, తమ్ముళ్ళ కోసం ఈ క్యాలెండర్ తీసుకువస్తున్నాం. ఈ క్యాలెండర్  ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు, ఏ నెలలో వస్తుందో స్పష్టంగా తెలియచెప్పడం కోసం క్రిస్టల్ క్లియర్‌గా తీసుకువస్తున్నాం.

    దీని ద్వారా అవినీతికి, పక్షపాతంకు, వివక్ష, లంచాలకు తావు లేకుండా చేయబోతున్నాం. అత్యంత పారదర్శకంగా, ఎలాంటి దళారులు, పైరవీలు, రికమండేషన్‌లకు తావు లేకుండా కేవలం రాత పరీక్షలో  మెరిట్ ప్రాతిపదికన మాత్రమే ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ఇంటర్వ్యూల విధానంకు పూర్తిగా స్వస్తి చెబుతూ మన ప్రభుత్వం అర్హులకు మాత్రమే ఉద్యోగాలు దక్కేలా చేస్తోంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో అక్షరాలా 6,03,756 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయగలిగాం.అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 1.22 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు.మన పిల్లలకు మన గ్రామాల్లోనే ఉద్యోగాలు