జగన్ ను హీరో అంటున్న ఆంధ్రజ్యోతి

         


 SPREAD NEWS;- ఆంధ్రజ్యోతి జగన్ మీద  జగన్ మూర్ఖుడు అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనం జనం దృష్టిలో హీరోని చేస్తుంది. తెలంగాణ దృష్టిలో విలన్ గా చేస్తుంది. ఈ విధంగా ఆంధ్రజ్యోతి పత్రిక జగన్ క్రేజ్ ను తెలుగు ప్రజల దృష్టిలో అమాంతం పెంచేసింది. కానీ నిజంగా జగన్ను ప్రజల దృష్టిలో చులకన చేయాలని కథనం రాసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ క్రేజ్ ను ప్రజల దృష్టిలో హీరోగా నిలబెట్టింది. అసలు విషయం ఏమిటంటే ఈ ఆంధ్రప్రదేశ్ కోసం జగన్ ప్రాజెక్టును నిర్మిస్తూ తెలంగాణ అభ్యంతరాలను లెక్క చేయకుండా నీటిని తరలిస్తున్న జగన్ ప్రభుత్వం. ఇది ఏపీలో జగన్ ప్రభుత్వం పై ప్రజాదరణ అమాంతం పెరుగుతుంది.

     ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సమస్యల పైన మన తె తెలంగాణ ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత లేనప్పటికీ, తన ప్రజల కోసం కెసిఆర్ కు తో ఘర్షణకు దిగిన ముఖ్యమంత్రిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పకుండా గుర్తించి గౌరవిస్తోంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ మళ్లింపు పథకం, తెలంగాణ మంత్రిమండలి తీవ్రంగ వ్యతిరేకించింది. అయినప్పటికీ రాజశేఖర్ రెడ్డిని మించి జగన్మోహన్రెడ్డి మూర్ఖుడిలా  వ్యవహరిస్తూ కృష్ణా బేసిన్లో ఏపీ సర్కారు అక్రమ ప్రాజెక్టులు చేపడుతూ, తెలంగాణకు అన్యాయం చేస్తుందని రాసిన ఈ వ్యాసం ప్రజల దృష్టిలో గొప్ప గౌరవంగా నిలుస్తుంది.

    అసలు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక  రాష్ట్ర విభజనలో అన్యాయం అయిపోయిన ఆంధ్ర ప్రజల తరఫున మాట్లాడాలి.  తెలంగాణ మీద మాట్లాడటం ఏంటి, అదీగాక ఏపీ ప్రభుత్వం  మౌనంగా ఉంటే లేదు లాభం లేదు, ఎక్కడికైనా పోరాటం చేసి తెలంగాణకు నీరు  ఇవ్వాల్సిందే. అని రాయటమూఏమీటీ ఆంధ్రజ్యోతి పేపర్. కెసిఆర్ కోపగిస్తే, జగన్ ఏమి కాదు, జగన్ కావాల్సిందే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు. అదే అయినకీ శ్రీరామరక్ష. ఇవే ఆయనకు ఎక్కువ టైం పదవిలో ఉండే దానికి దోహదపడతాయి.