SPREAD NEWS( అమరావతి);-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ లైబ్రరీ లపై,అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్షించారు. వీటి పురోగతి, వీటిని ముందుకు ఏ విధంగాతీసుకుపోవాలి. ఇది ఏ విధంగా ఉంటే మన ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు, ప్రజల ఉద్యోగాలు తొందరగా ఎలా వస్తాయి ,అనే అంశాల మీద అనే అంశాల మీద వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేశారు.
పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వైఎస్‌ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్(ఈఎంసీ) సీఈఓ ఎం నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరు.