SPREAD NEWS( అమరావతి);- ఏపీకి మహర్దశ పట్టబోతుం దా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదే పని మీద ఉంది. విశాఖని దేశంలో ఉన్న మెట్రో నగరాలకు ధీటుగా తయారు చేసే దానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఉక్కు నగరంగా దేశవ్యాప్తంగా ఇమేజ్ వున్న విశాఖ. ఇప్పుడు కొత్తగా విశాఖకుఐటి ఇమేజిని పెంచడానికి నిర్ణయం తీసుకుని ,ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. అదే విధంగా విశాఖ ని ఐటి హబ్ చేసి ఉద్యోగ రూపకల్పనకు విశాఖ కేంద్రీకృతం కానున్నది. ఇప్పుడు తాజాగా అయితే ఐటి యూనివర్సల్ దిశగా అడుగులు. నాణ్యమైన విద్యకు విశాఖ కేరాఫ్ కాబోతుంది. ఐటీ కంపెనీలకు కూడా అనేక ప్రోత్సహిస్తూ కంపెనీ పెట్టిన సంవత్సరం లోపల ఇన్సెంటివ్ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి వైపు నడపడానికి జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు, ఇవన్నీ సక్సెస్ దిశగా నడవాలని కోరుకుందాం.