సేవలో రోటరీ సేవలు చిరస్మరణీయం

     


SPREAD NEWS( నెల్లూరు );- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరంలో రోటరీ ఆడిటోరియంలో, రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా విశ్వం  ఊరందూరు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. మొట్టమొదట దివ్యాంగులకు విశ్వం గారి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ట్రై సైకిల్స్ అందించారు. అనంతరం నూతన హంగులతో ఉన్న రోటరీ క్లబ్ కార్యాలయాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించారు.

     


2021‍- 2022 సంవత్సరానికి నూతన కార్యవర్గం అధ్యక్షుడుగా విశ్వం ఊరందూరు గారు,  సెక్రటరీగా ముస్తాక్అహ్మద్ గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభినందించారు. ఈ రోటరీ సేవలకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో దొడ్ల భరత్ రెడ్డి మాజీ జిల్లా గవర్నర్, కోటం రెడ్డి ప్రతాపరెడ్డి మాజీ అసిస్టెంట్  గవర్నర్  తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన విశ్వం ఊరందూరుగారు  మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి  రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి గారు  విచ్చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని, ఎన్నో పనులు ఉన్నప్పటికీ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారని అన్నారు.

   


 నా పిరీడ్లో హెల్త్ కి ఇంపార్టెంటని, అనేక మెడికల్ క్యాంపులు పెడతానని, పల్స్ పోలియో పై మరింత దృష్టి పెడతానని, వ్యాక్సిన్ను గురించి కూడా ఆలోచిస్తున్నానని, ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, ప్రభుత్వ పాఠశాల కూడా దత్తత తీసుకుని దాన్ని మోడల్ స్కూల్ గా చేస్తామని, ప్రజల ఆశీర్వాదం తో ఇంకా అనేక మంచి పనులు చేయాలనుకుంటున్నాం అని అన్నారు.