SPREADNEWS(అమరావతి);- వైయస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభోత్సవం.క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్ధాపన చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.‘దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు దశల్లో 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్నాం. ఆ బాధ్యత గృహ నిర్మాణ శాఖకు అప్పగించినందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో కొన్ని అభివృద్ది నిరోధక శక్తులు ఎన్ని కుయుక్తులు పన్నినా, అన్నింటిని ఎదుర్కొని ఒకేసారి 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. ఇప్పుడు ఇళ్ల నిర్మాణంతో చాలా మందికి ఈ కరోనా సమయంలో పని దొరుకుతుంది. మెటేరియల్ అమ్మకాల వల్ల ఎకనామీ బూస్ట్ అవుతుంది.
ఇళ్ల నిర్మాణం పూర్తైతేదాదాపు రూ.4 లక్షల కోట్ల సంపద వస్తుంది. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం పని చేస్తున్నారు. అందరినీ కలుపుకుని పోయి ఈ పథకాన్ని సక్సెస్ చేస్తానని చెబుతున్నాను. 15.60 ఇళ్లకు సంబంధించి మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత 5 నెలలుగా ప్రిపరేటరీ పనులు 95 శాతం పూర్తి చేశాం. మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్, నరేగా జాబ్ కార్డు జనరేషన్, లేఅవుట్లలో మౌలిక వసతులు.. నీటి సరఫరా, విద్యుత్ వంటివి కల్పించాం. అలాగే మెటేరియల్ సేకరణ కూడా దాదాపు పూర్తి చేశాం. అందుకే ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం మొదలు పెడుతున్నాం.
‘వారం రోజుల పాటు లేఅవుట్లలో పనులు కొనసాగుతాయి. ఇందులో వలంటీర్ల పాత్ర చాలా కీలకం. లబ్ధిదారులకు తగిన విధంగా మార్గదర్శకం చేయాలి. ఇక్కడ మన సీఎం గారు అన్నీ స్వయంగా చూస్తున్నారు. చివరకు ఇళ్లలో ఎలాంటి సదుపాయాలు ఉండాలన్నది ఆయన స్వయంగా నిర్దేశించారు. అదే విధంగా అన్ని లేఅవుట్లలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలని ఆదేశించారు. ఆయన నిజంగా ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో కేవలం ఇళ్ల నిర్మాణం కోసం జిల్లాకు ఒక జేసీని నియమిస్తున్నారు.