ముఖ్యమంత్రి వైయస్ . జగన్మోహన్ రెడ్డి కి జిల్లా తెలగ సంక్షేమ అభినందనలు

     


 SPREAD NEWS(శ్రీకాకుళం );-  కాపు , తెలగ, బలిజ, ఒంటరి అని పిలువబడే కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు  కి శాసనమండలిలో ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి కాపు జాతిని గౌరవించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  జిల్లా  తెలగ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసిందని జిల్లా అధ్యక్షులు  రొక్కం. సూర్యప్రకాశరావు అన్నారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు తన పాదయాత్రలో అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం సమతూకంతో గతంలో ఏ ప్రభుత్వాలు ఈయని విధంగా పదవులు ఇచ్చి చరిత్రలో  నిలిచి పోతున్నందుకు ఆనందంగా  ఉందన్నారు. 

     పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అవ్వలకు, తాతలకు, అన్నలకు, తమ్ముళ్లకు అక్కలకు, చెల్లెళ్లకు, చదువుకునే పిల్లలకు, ఆటో కార్మికులకు, కర్షకులకు, రైతన్నలకు, ఇలా అందరితోపాటు అనేక కార్పొరేషన్లకు చైర్మన్ ల  నియామకం గాని, అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందివ్వడంలో గాని, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం  లో గాని చరిత్ర సృష్టించారన్నది ప్రతి పక్షాలు సైతం ఒప్పుకొని తీరాలన్నారు.

      గత ఎలక్షన్లో  ఈజిల్లాతో పాటు ఉత్తరాంధ్ర లో ఉన్న  తెలగ సామాజికవర్గానికి చెందిన  వారు 90% మంది వైసీపీ నే   బలపరిచామని, ఇదే పరిస్థితి  చివరిదాకా కొనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా ఇటీవల తెలగ సామాజిక వర్గానికి చెందిన  బసవ . హరి నారాయణ , బసవ. లక్ష్మి , ఇల్ల. షణ్ముఖ రావు , మామిడి. ఈశ్వర్ రావు  అకాల మరణం చెందినందుకు చింతిస్తూ జిల్లా సంఘం ప్రగాఢ నివాళులర్పింఛారు.

     ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు రొక్కం. సూర్య ప్రకాష్ రావు, జాయ్ న్యూస్ అధినేత బోనం. మురళి, శవ్వాన. ఉమా మహేశ్వరి, యర్నాగుల. వెంకట రమణ, రొక్కం . సత్యనారాయణ, త్రిపురాన . రాజేంద్ర దాస్, ఇనుముల. జనార్ధన రావు, కురుమెళ్ల. శశిభూషణ రావు, డాక్టర్. గుండ బాల మోహన్  తదతరులు పాల్గొన్నారు.