కోవిడ్‌ మూడో వేవ్‌వస్తుందా?

     


SPREAD NEWS(అమరావతి);-కోవిడ్‌ మూడో వేవ్‌పై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమగ్ర సమీక్ష.మూడో వేవ్‌పై అనాలసిస్, డేటాలను సీఎంకు వివరించిన అధికారులు.థర్డ్‌వేవ్‌ వస్తేకనుక పిల్లలకు అందించాల్సిన అంశంపై సమావేశంలో చర్చ.థర్డ్‌ వేవ్‌ వస్తుందా? లేదా? అన్నదానిపై శాస్త్రీయ నిర్ధారణ లేదని వెల్లడించిన అధికారులు.అయినా ఒకవేళ వస్తే కనుక తలెత్తే పరిణామాలు, ప్రభావితమయ్యే వారి వివరాలపై అంచనాలను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు.ఈ నేపథ్యంలో పోషకాహార కార్యక్రమం కొనసాగాలని, టీకాల కార్యక్రమం కూడా కొనసాగించాలన్న అధికారులు.వినియోగించాల్సిన మందులు, పరికరాలు, బయోమెడికల్‌ ఎక్విప్‌మెంట్, తదితర అంశాలపైకూడా చర్చ.

థర్డ్‌వేవ్‌పై సీఎం ఆదేశాలు

     ఒకవేళ థర్డ్‌వేవ్‌కనుక వస్తే పిల్లల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది, తీవ్రత ఏ రకంగా ఉంటుందన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్న సీఎం.పీడియాట్రిక్‌  సింప్టమ్స్‌ను గుర్తించడానికి ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలన్న సీఎం.అన్ని టీచింగ్‌ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయాలన్న సీఎం.ల్లలకు అత్యుత్తమ వైద్యం అందించడానికి వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధిచేయాలని ఆదేశాలు.థర్డ్‌వేవ్‌ వస్తుందనే అనుకుని కావాల్సిన మందులను ముందే తెచ్చి పెట్టుకోవాలని ఆదేశాలు .చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి రాష్ట్రంలో మూడు కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు.