వైసీపీ పాలనలో పెరిగిన ధరల ఘాటు

     


SPREAD NEWS( శ్రీకాకుళం);- రాష్ట్రం లో వైసీపీ పాలనలో పెంచిన పన్నుల పోటు,  పెరిగిన ధరల ఘాటు,మాత్రమే కనిపిస్తోందని  ప్రజారోగ్యం  కుంటుపడిందని  అభివృద్ధి  అడ్రస్ లేకుండా పోయిందని   శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు . వెంకటేష్ & జిల్లా నాయకులు ధ్వజమెత్తారు. 

    రాష్ట్రం లో వైసీపీ  రెండేళ్లు పాలనలో  ఏ కోశానా అభివృద్ధి అన్నది లేదని దాని అడ్రస్ కనిపించడం లేదని విపరీతంగా ఆస్తిపన్ను పెంపు,  చెత్త పై పన్ను తదితర ప్రజావ్యతిరేక నిర్ణయాలతో పాటుగా  కరోనా సమయం లో ప్రభుత్వ నిర్లక్ష్యం  బాధ్యతారాహిత్యం తో  వేలాది ప్రాణాలు గాలి లో కలిసి పోయాయని వీటిన్నిటి పై  రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం  ఈ నెల 16 నుండి 22 వరకు  టీడీపీ ఆధ్వర్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన కార్యక్రమాలు  నిర్వహించడం జరుగుతోందని అన్నారు.

    ఈరోజు (16/06/21)  శ్రీకాకుళం  నగరంలో  నియోజకవర్గం టీడీపీ  ఇంచార్జి గుండ లక్ష్మీదేవి గారి ఆదేశానుసారం స్థానిక  ఎం. ఆర్. వో. వి. వి. ప్రసాద్  కి  కార్యాలయంలో  ప్రభుత్వ వైఫల్యాలు,  ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాలపై   వినతి పత్రం  అందించి అనంతరం నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్,  జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు  పీ  జే. బాబు ,  జిల్లా మీడియా  కో ఆర్డినేటర్ డాక్టర్  . జామి. భీమ శంకర్ మాట్లాడుతూకరోనా నియంత్రణ కు ప్రతీ ఒక్కరికి వాక్సిన్ వేయడమే మార్గమని అందువలన వాక్సి నేషన్  వేగవంతం చేయాలని,  మరింత ప్రాణ నష్టాలు జరగ కుండా ప్రజలను కాపాడాలని  అన్నారు.

   "ఆక్సిజన్ అందక మరణించిన కుటుంబాలకు 25 లక్షలు, బ్లాక్ ఫంగస్ తో మృతి చెందిన వారికి 20 లక్షలు,  ప్రతీ కోవిడ్  మృతి లకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా"  ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు.