బొణిగి ఆనందయ్య గారి ఆయుర్వేదం మందుని వెంటనే ప్రజలకు అందుబాటులో తేవాలి

     


SPREAD NEWS(నెల్లూరు);- ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నం వాస్తవ్యులు ఆయుర్వేద వైద్యులు శ్రీ బొణిగి ఆనందయ్య గారిని జనసేన పార్టీ మైనారిటీ విబాగం తరుపున కలవడం జరిగింది. కరోన కష్టకాలంలో ప్రపంచమంతటా ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఆ తరుణంలో దేవుడు రూపంలో వచ్చి ఆయుర్వేదం మందుని తయారు చేసిన గొప్ప వ్యక్తిగ మన నెల్లూరు జిల్లా వాసి ఆనందయ్య గారు. భారతదేశ ప్రజలందరూ ఆయుర్వేద మందు కోసం నిరుపేదలు, అభాగ్యులు వెయ్యి కళ్ళతో వేచి ఉన్నారు.

     అందరి పట్ల కనికరించి నిరుపేదలకు వీలైనంత త్వరలో ఈ ఆయుర్వేద మందుని అందుబడులోకి తేవాలని, మనస్ఫూర్తిగా జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున జనసేన పార్టీ జనసైనికులు మరియు వీరమహిళలు తరపున కోరడమైనది. అలాగే ఆంధ్ర మరియు తెలంగాణ జిల్లాల్లో జనసేన పార్టీ తరఫున స్వచ్ఛందంగా కోవిడ్ నిబందనలు పాటిస్తూ ఈ ఆయుర్వేద మందులు ఇవ్వడానికి మేము సైతం వాలంటీర్ గా  ముందుంటాం అని తెలియచేయుచున్నాము.

    పార్టీలకు అతీతంగా ఆనందయ్య గారి ఆయుర్వేద మందుని ప్రజలకు చేర్చడంలో ఇప్పటికే చాల ఆలస్యం అయింది కనుక ప్రభుత్వం సహకరించి ఆనందయ్య కు కావలసిన వన మూలికలు మరియు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని ప్రస్తుత అత్యవసర సమయములో మందుని ప్రజలకు ఇంవడంలో ఆలస్యం ఐతే మాత్రం జనసేన చేస్తుఉరుకోబోదని, గాందియుత మార్గంలో కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగుతాం అని జనసేన మైనారిటీ విబాగం నుంచి తెలియచేయుచున్నాను.