18,19,20 తేదీల్లోవిశాఖ వేదికగాప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్టార్టప్ కాంగ్రెస్ అండ్ ఎక్స్ పో
SPREAD NEWS(అమరావతి);-ఐ.టీ, విద్యా, నైపుణ్యం, స్టార్టప్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.విద్య, నైపుణ్య, ఐ.టీ రంగాలలో ముఖ్యమంత్రి నాయకత్వంలో అనేక సంస్కరణలకు శ్రీకారం.రెండేళ్ల కాలంలో విద్య నుంచి ఉపాధి వరకూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు.ప్రతి రోజూ ఐ.టీ, నైపుణ్య,విద్య, పరిశ్రమ రంగాలలో అనేక మార్పులు.కోవిడ్ వల్ల ఊహించని విధంగా టెక్నాలజీ ఆవశ్యకత మరింత పెరిగింది.
సాంకేతికతోనే చిన్నారులకు, యువతకు భవిష్యత్
ఎన్నటికీ వన్నెతరగనిది, విలువ తగ్గనిది సాంకేతిక,విద్య, నైపుణ్యం మాత్రమే.విద్యకు, టెక్నాలజీ, నైపుణ్యం జోడించినపుడే మరింత ప్రయోజనం.మునుపటిలా ఇంటర్నెట్ అనేది ఏ కొందరికో కాకుండా ప్రతి ఒక్కరికీ అందాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం.ఐ.టీ, ఎలక్ట్రానిక్ రంగాల గమ్యస్థానంగా భావించి ఈ 'జీఎస్ యూఈ'ని విశాఖలో నిర్వహించేందుకు శ్రీకారం.డిజిటల్ లైబ్రరీ, ఇంటర్నెట్, టెక్నాలజీ, నైపుణ్యాలకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట.ప్రపంచ స్థాయి నాలెడ్జ్ ని పంచుకుని, మరిన్ని ఆవిష్కరణలతో మరింత ముందుకు.
ప్రపంచస్థాయి పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఏపీ అడుగులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐ.టీ, విద్యా శాఖలు సంయుక్తంగా నిర్వహించనున్న ఎక్స్ పోకీ,ప్రపంచ వ్యాప్తంగా హాజరుకానున్న వేలాది మంది టెక్నాలజీ, నైపుణ్యం, విద్య, స్టార్టప్, పారిశ్రామిక రంగాల నిపుణులు.పాల్గొననున్న పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పాలసీ తయారీదారులు, స్కాలర్లు, వివిధ ప్రభుత్వ శాఖల సభ్యులు, కార్యదర్శులు, తదితరులు.భారతదేశం, భారత దేశ యువత సామర్థ్యపు వెలుగులను దశదిశలా చాటే దిశగా భాగస్వామ్యమవనున్న ప్రపంచస్థాయి టెక్ మార్క్ టీమ్.సరికొత్త శ్రీకారంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఆత్మనిర్భర్ లక్ష్యాలను అందుకోవడానికి ప్రణాళిక.