అశ్రునయనాల మధ్య ముగిసిన వీర జవాన్ అంత్యక్రియలు

     


SPREAD NEWS( బాపట్ల);-జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ జస్వంత్ రెడ్డి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య అత్యంత భారీగా తరలివచ్చిన ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. భౌతికకాయం సొంత గ్రామానికి చేరుకోగానే, బాపట్ల లోని కొత్తపాలెం స్మశానవాటికలో అంత్యక్రియలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జస్వంత్ రెడ్డి భౌతిక కాయం వద్ద ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, హోంమంత్రి మేకపాటిసుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్, ఘనంగా నివాళులు అర్పించారు.

     


జమ్ము కాశ్మీర్ రాజోలిజిల్లా  సుందర్ భవాని సెంటర్లో గురువారం సాయంత్రం జరిగిన  గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొత్తపాలెం  చెందిన జవాన్ జస్వంత్ రెడ్డి(23) అమరుడైన విషయం మన అందరికీ తెలిసిందే. ఉగ్రవాద  కాల్పుల్లో ఇద్దరు మరణించగా వారిలో ఒకరు మన తెలుగు వాడు జశ్వంత్ రెడ్డి. ఆయన తండ్రి శ్రీనివాస రెడ్డి, తల్లి వెంకటేశ్వరమ్మ, యశ్వంత్ రెడ్డి, విశ్వంత్ రెడ్డి, అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఆయన కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచి 50 లక్షల పరిహారం తో పాటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.

      2015లో ఆర్మీలో ఉద్యోగం సంపాదించి ప్రస్తుతం ఆయన జమ్మూకాశ్మీర్లో ఇన్ఫాంటీ విభాగంలోజవాన్ విధులు   నిర్వహిస్తున్నారు. నాలుగు నెలల క్రితం సెలవుపై వచ్చి వెళ్లారు. వచ్చే నెలలోనే అతనికి వివాహం. ఇంతలో అతను మరణించటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు శోకసముద్రంలో ఉన్నారు. మనకోసం ఈ భారత ప్రజల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వీర జవాన్ నీకు యావత్ ప్రజల తరఫున సెల్యూట్.