పులివెందులలో పైలట్‌ ప్రాజెక్టుగా మహిళా మార్ట్‌

     


SPREADNEWS(అమరావతి);- మహిళా మార్ట్ నిర్వహణపై సీఎం అభినందనలు

     మహిళా సంఘాల సహాయంతో మార్ట్‌ నిర్వహణ బాగుందన్న సీఎం

     మార్ట్‌లో మహిళలను భాగస్వాములుగా చేయడం బాగుందన్న సీఎం

     తక్కువ ధరలకూ వారికి అందుబాటులో సరుకులు అందడం బాగుందన్న సీఎం

     ఒక్కో మహిళనుంచి రూ.150ల చొప్పున 8వేలమంది మహిళా సంఘాల సభ్యులనుంచి సేకరించి, ఆ డబ్బుతో మార్టు పెట్టామన్న అధికారులు

     మెప్మా దీనిపై పర్యేవేక్షణ చేస్తుందన్న అధికారులు

     మెప్మా ఉత్పత్తులు కూడా ఈ మార్ట్‌లో ఉంచామన్న అధికారులు

     మార్ట్‌ నిర్వహణ పనితీరుపై నిశిత పరిశీలన చేసి... మిగతాచోట్ల కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలన్న సీఎం.

     ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ పి లక్ష్మీ నరసింహం, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి వి రామ మనోహరరావు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఎం ఎం నాయక్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.