SPREAD NEWS(అమరావతి);-అమరావతి భూకుంభకోణం కేసులో కీలక సాక్షిగా చెరుకూరి శ్రీధర్,చెరుకూరి శ్రీధర్‌ను విచారించిన సీఐడీ అధికారులు.రెవెన్యూ రికార్డుల మాయంపై అధికారులకు వివరణ ఇచ్చిన శ్రీధర్.సీఐడీకి కీలక విషయాలు వెల్లడించిన సీఆర్డీఏ మాజీ కమిషనర్ శ్రీధర్.2015లో ల్యాండ్ ఫూలింగ్‌కు ముందే 2014 అక్టోబర్‌లో తుళ్లూరు మండలం రికార్డులను రహస్యంగా తెప్పించుకున్నారన్న శ్రీధర్.2015 జనవరిలో ల్యాండ్ ఫూలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడి.
అసైన్డ్ భూముల సేకరణపై జీవో 41 తీసుకొచ్చారన్న శ్రీధర్.ఇదంతా మాజీ మంత్రి నారాయణ పర్యవేక్షించారని తెలిపిన శ్రీధర్.ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977కు విరుద్ధంగా ఉన్న అంశాలను మాజీ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లానన్న శ్రీధర్.చట్ట వ్యతిరేకమని ముందే చెప్పినా నారాయణ వినిపించుకోలేదని వెల్లడి.నారాయణ ఆదేశాలతోనే భూముల వ్యవహారం జరిగిందన్న శ్రీధర్.మాజీ మంత్రి నారాయణ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.విచారణకు అనుమతి కోరుతూ హైకోర్టులో సీఐడీ కౌంటర్ దాఖలు
చంద్రబాబు అండ్ కో దళితులను బెదిరించి అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారటానికి ఇదిగో సాక్ష్యం
వీడీయో సాక్ష్యాలను సీఐడీ అధికారులకు ఇచ్చి, అమరావతి రాజధాని భూముల కుంభకోణంపై సమగ్ర విచారణ చేయాలని కోరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు తమకు వత్తాసు పలికే అధికారులను అడ్డం పెట్టుకుని కారుచౌకగా దళితుల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారుః ఆర్కే.