SPREAD NEWS(NELLORE);- మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మన ప్రియతమ నేత 72 వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మన ప్రియతమ నేత రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక సారి గుర్తుచేసుకుందాం. ఒక సంతకం ఎన్నో లక్షల మందికి చదువు నేర్పింది. ఇంకొక సంతకం ఎన్నో లక్షల మందికి ఆరోగ్య జీవితాన్ని ఇచ్చింది. మరొక సంతకం ఎన్నో లక్షల మందికి ఉద్యోగం ఇప్పించింది. ఇటువంటి సంతకాలు అనేకం, చేసి జన హృదయాల్లో నిలిచి, జనహృదయనేత గా ఎదిగాడు. ఆంధ్ర ప్రదేశ్లో తెలుగు వారి గుండెల్లో కొలువై ఉండి, ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి, కోట్ల మంది గుండెల్లో కొలువై ఉండీ, మీ పరిపాలన అనేక మందికి ఆదర్శంగా నిలిచింది. తీపి గుర్తులతో ఈ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎప్పుడు నీకు రుణపడి ఉంటారు. అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.