SPREAD NEWS(అమరావతి);- నేడు జగనన్న విద్య దీవెన కార్యక్రమంలో10.97 లక్షల మంది విద్యార్ధులకు,రూ.693.81 కోట్లను క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలో జమ చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ సందర్భంగా భావితరాలకు మనము వెలుగును ఇవ్వాలంటే, పిల్లలను చదివించడం ఒకటే మార్గమని ఉన్నత చదువుల తోనే పేదరిక నిర్మూలన సాధ్యమని.
పిల్లల తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదని లక్ష్యంతో ఈ ఆంధ్ర ప్రదేశ్ ను చదువుల ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని లక్ష్యంతో నూరు శాతం ఫీజు ఇస్తున్నాం. గత ప్రభుత్వ బకాయిలు చెల్లించాము. చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు తల ఎత్తుకుని ఉండాలని మొదటి విడత ఏప్రిల్ లో, రెండో విడత ఇవాళ చెల్లించగా, మూడో విడత డిసెంబర్ లో, నాలుగో విడత ఫిబ్రవరిలో చెల్లిస్తాం.
తల్లుల చేతికే డబ్బు ఇచ్చి, వారే నేరుగా ఫీజులు చెల్లించేలా చేశాం. తద్వారా కాలేజీల్లో వసతులు బాగాలేకపోతే కాలేజీలను పిల్లల తల్లిదండ్రులు నిలదీసే పరిస్థితి కల్పించాం. వారు డబ్బులు కడుతున్నారు కాబట్టి వారికి ఆ హక్కు ఉంటుంది. పిల్లలకు భవిష్యత్తులో మంచి జరగాలని మంచి గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఈ కార్యక్రమానికి దేవుడు దీవించాలని మీ అందరి ఆశీస్సులు కావాలని ,ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను అనిరూ.693.81 కోట్లను క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలో జమ చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.