ఉతికి ఆరేసిన వసంతకృష్ణ ప్రసాద్

     


 SPREAD NEWS;-మా నాయకుడైన జగన్ గారి సంకల్ప బలం తో తొలిసారిగా శాసనసబ్యుడినైన నేను ఇక్కడ సుమారుగా 20 వేలమంది పేదలకు ఇల్ల పట్టాలను ఇవ్వడం జరిగింది.దీన్ని చూసి ఓర్వలేక..పూర్వం దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి బగ్నం చేసినట్టుగానే  ఈ దేవినేని ఉమా ఒక శిఖండిలా తయారయ్యాడిప్పుడు.ఎన్నో ఏళ్ళుగా టీడీపీ పాలించింది..దేవినేని ఉమ 10 ఏళ్ళు శాసన సబ్యుడిగా ఉండి.. పేదలకు ఇక్కడ 500 మందికి కూడా ఇల్ల పట్టాలు ఇవ్వలేకపోయాడు.

    20 ఏళ్ళ నుండి జీ .కొండూరు మండలం లో క్వారీయింగ్ జరుగుతుంది..ఐతే ఇక్కడ ఈ ప్రాంతం మాదంటే మాదనే వివాదం రెవెన్యూ,అటవీశాఖలమద్య గత 20 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది.గతం లో టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు ఫారెస్టు శాఖవారు ఇది మాకు చెందిన భూమి అని చెబితే...అబ్బే అది తప్పు అని...ఇది రెవెన్యూకి చెందిన భూమని అప్పటి మంత్రి కే.ఇ కృష్ణమూర్తిగారిద్వారా వాదించి అక్కడ ఒక క్రషర్ ను దేవినేని ఉమా స్వయంగా ప్రారంబోత్సవం చేసి నడిపించాడు.

    వారు అధికారం లో ఉన్నప్పుడు అవి రెవెన్యూ భూములైనప్పుడు...ఇప్పుడెలా ఫారెస్టు భూములయ్యాయి.దేవినేని ఉమా అనేవాడు ఒక పెద్ద దొంగ...కాలం కలిసొచ్చి అతని అన్న,వదిన మరణించి వీడికి రాజకీయంగా అవకాశమొచ్చింది.మిగతా పార్టీలో ఉన్న కమ్మవారెవారినీ కమ్మవారుగా వీరు గుర్తించరు....ఉదాహరణకు పిన్నమనేని వెంకటేశ్వరావుగారు,వసంత నాగేశ్వర్రావుగారు ఇలా వేరే పార్టీలలో ఉన్నవారంతా వీరికి కమ్మవారుగా కనబడరు... వీరంతా అసలు కమ్మవారు కాదనేదే పచ్చ మీడియా ఉద్దేశం....ఇదే ఉద్దేశం తో గత కొన్నేళ్ళుగా మాపై ఈనాడు,ఆంధ్రజ్యోతి బురద జల్లుతూనే ఉన్నాయి.

    మా వారిపై జరిగిన దాడిని ఉమాపై జరిగిన దాడిగా చిత్రీకరిస్తూ ఈ పచ్చమీడియా మాపై కుట్ర పన్నుతుంది.అసలక్కడేమి జరిగిందో తెలియకుండానే...బొత్తిగా తూర్పుకి,పడమరకీ తేడా తెలియని లోకేశ్ కూడా మాపై ఆరోపణలు చేస్తున్నాడు.(వసంత కృష్ణప్రసాద్ .మైలవరం ఎమ్మెల్ల్యే)