SPREAD NEWS(అమరావతి);- మున్సిపాల్టీలు, నగరాల్లో రోడ్ల మరమ్మతుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం.రోడ్లు భవనాల శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించుకోవాలి : అధికారులకు సీఎం ఆదేశం.పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచాలి.రోడ్ల మరమ్మతును ప్రాధాన్యతగాచేపట్టాలి.వర్షాకాలంముగియగానే రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న సీఎం.
పట్టణాలు, నగరాల్లో కనస్ట్రక్షన్, డిమాలిషన్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టాలన్న సీఎం.విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో ఇప్పటికే ప్లాంట్లు ఉన్నాయని సీఎంకు తెలిపిన అధికారులు.రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంల్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కావాలని సీఎం ఆదేశాలు.దీనివల్ల ప్రతి 2వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు వస్తుందన్న సీఎం.ప్రజలకు అత్యంత చేరువలో సేవలు లభిస్తాయి. దీంతోపాటు.. ఆ గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిధిలో భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుంది : సీఎం.దీనివల్ల ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదన్న సీఎం.