ఈ నెల 18 న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్

     


 SPREAD NEWS;- ఆంధ్రప్రదేశ్ లో గత ఏప్రిల్ నెల 8 న పరిషత్ ఎన్నికలు జరిగాయి.  515 జెడ్ పి టి సి లకు, 7220 ఎంపిటిసి లకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలను రద్దు చేయాలంటూ ప్రత్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... పరిషత్ ఎన్నికలు చెల్లవని తిరిగి ఎన్నికలు జరపాలని హైకోర్టు సింగిల్ బెంచి తీర్పునిచ్చింది. ఆట్టి తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసుకోగా... విచారణ అనంతరం  ఈరోజు అట్టి పిటిషన్ పై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నెల 18 న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్.