ఈనెల 19వ తేది ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జడ్పిటిసి,ఎంపిటిసి ఓట్ల లెక్కింపు

       


SPREAD NEWS(విజయవాడ);- ఈనెల 19వ తేది ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జడ్పిటిసి,ఎంపిటిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు ఎస్పిలు, డిపిఓలు,జడ్పి సిఇఓలతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ  ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ కు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని సిఎస్ స్పష్టం చేశారు.

    కౌంటింగ్ రోజున ఆయా కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడంతో పాటు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పి లను సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.అదే విధంగా కౌంటింగ్ కేంద్రాలకు సమీపంలో ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడ కుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్,ఎస్పిలు కూర్చుని కౌంటింగ్ సజావుగా జరిగేందుకు తగిన విధంగా ప్రణాళిక సిద్దం చేసుకొని సక్రమంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ చెప్పారు

ఎలక్షన్ల డేటు 18 వ తారీకు నుండి 19 వ తారీకు మారింది