ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై కొన్ని విషయాలు

     


SPREAD NEWS;- 1.  1982 మార్చ్ 21 వ తారీఖు - ఎన్టీఆర్ రామకృష్ణా స్థూడియో లో విలేకరుల సమావేశం పెట్టి తాను ప్రజాజీవితం లోకి వస్తాను అని ప్రకటించారు.  ఆ సమయం లో అక్కడ చంద్రబాబు లేరు. 

2. ఎన్టీఆర్ అలా ప్రకటించగానే నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్టీఆర్ తో చేరారు.  చంద్రబాబు రాజీనామా చెయ్యలేదు.

3 . 1982 మార్చ్ 29 వ తారీఖు -  ఊటీ లో సినిమా షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్ ఇంటికి కూడా పోకుండా, నేరుగా నాదెండ్ల భాస్కర్ రావు గారి ఇంటికి వెళ్లారు.  ఆ సమయం లో ఆయన వెంట చంద్రబాబు లేరు. 

4. న్యూ ఎమ్మెల్యే క్వార్ట్రర్స్ లో మీటింగ్ పెట్టి పార్టీ పేరు తెలుగుదేశం అని ప్రకటించారు ఎన్టీఆర్.  అప్పుడు చంద్రబాబు లేరు.  

5. ప్రజాజీవితం లోకి వచ్చే ముందు ఎన్టీఆర్ ఇద్దరు ప్రముఖుల సలహా తీసుకున్నారు.  ఒకరు అక్కినేని.  అయితే అక్కినేని రాజకీయాల పట్ల విముఖత చూపారు.  (ఈ విషయం అక్కినేని తరువాత కొన్ని సార్లు చెప్పారు).  రెండో వారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు.  కోట్ల వారు కాంగ్రెస్ పార్టీ వీడి రావడానికి తిరస్కరించారు.  

6.  రామకృష్ణ స్థూడియో లో ఎన్టీఆర్ ఒక తెల్లకాగితం మీద తెలుగుదేశం లోగో ను డిజైన్ చేశారు.  దాని మీద చక్రం, నాగలి, గుడిసె బొమ్మలు వేసి అక్కడ ఉన్న ప్రముఖులకు చూపించి అభిప్రాయం అడిగారు.  ఆ ప్రముఖులు ఎవరంటే .. సర్వశ్రీ బెజవాడ పాపిరెడ్డి, యలమంచిలి శివాజీ, నాదెండ్ల, రత్తయ్య, ఆదెయ్య, నారాయణ, దగ్గుబాటి చెంచురామయ్య, తుర్లపాటి కుటుంబరావు.  ఆ సమయంలో చంద్రబాబు ఎన్టీఆర్ వెంట లేరు. 

7.  1982 ఏప్రిల్ 1 ...హైదరాబాద్ నిజాం గ్రవుండ్స్ లో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ జరిగింది.  అక్కడ చంద్రబాబు లేరు.  

8.  మొదటి సభ ముగిశాక చంద్రబాబు మద్దతు కోరి తెలుగుదేశం పార్టీ లోకి ఆహ్వానించడానికి డాక్ట్రర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు కాంగ్రెస్  ప్రభుత్వం లో సినిమాటోగ్రఫీ మంత్రి గా ఉన్న చంద్రబాబు వద్దకు వెళ్లారు.  చంద్రబాబు కాగితం మీద ఏవో లెక్కలు వేసి 'రామారావు జేబు లోంచి పైసా తియ్యడు.  ఆయనకు అయిదు శాతం ఓట్లు మాత్రమే వస్తాయి.  సినిమా మోజులో ఓట్లు పడతాయా?  నేను మంత్రి పదవి వదులుకుని ఎలా వస్తాను?"  అన్నారు.  (ఎన్టీఆర్ కు మహా వస్తే 30-40 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ దే మళ్ళీ అధికారం అని నాటి కాంగ్రెస్ నాయకులు భావించారు.  చంద్రబాబు లెక్క కూడా అదే. ముఖానికి రంగులు వేసుకునే వాడికి ఓట్లు వేస్తారా అని జలగం, కోట్ల, జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి లాంటి హేమాహేమీలు ప్రకటించడం నాకు బాగా గుర్తు.) 

9.  1982 నవంబర్ 18 వ తారీకు - అధిష్టానం ఆదేశిస్తే ఎన్టీఆర్ మీద పోటీకి రెడీ అని చంద్రబాబు ప్రకటించారు.  (ఈ విషయం నాటి అన్ని దినపత్రికలలో వచ్చింది.  సాక్ష్యాలు దొరుకుతాయి.  అప్పటి విలేకరులు ఇప్పుడూ కొందరు ఉన్నారు.  నేను ఆ మాట అనలేదని చంద్రబాబు అనడం చోద్యం గా ఉంది) 

10. 1983 జనవరి 5 వ తారీకు - పుట్టినగడ్డ చంద్రగిరి లో మేడసాని వెంకటరామ నాయుడు అలియాస్ మీసాల నాయుడు చేతిలో 17,429 ఓట్ల తేడాతో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు.  

                                                                                                                                            ( కొరవ2లొ)