నైపుణ్య ఆధారిత శిక్షణతో నిరుద్యోగ యువత భవితకు బంగారు భాటలు

     


SPREAD NEWS;- పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు శిక్షణ

స్కిల్ డెవలప్మెంట్ పార్ట్ నర్స్ గా  ప్రముఖ పరిశ్రమలు

ఏపి విధానానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డిసి) నుంచి అభినందనలు 

స్కిల్ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయడంలో భాగంగా ఐబిఎం, టెక్ మహీంద్రా, దాల్మియా, డెల్, హెచ్. సి.ఎల్ తదితర 13 ప్రముఖ సంస్థలతో ఒప్పందం

రూ.460 కోట్లతో  ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో 23 నైపుణ్య కళాశాలలు 

ఇప్పటికే ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా  పులివెందులలో ఒక స్కిల్ ఇనిస్టిట్యూట్ కు శంఖుస్థాపన

6 స్కిల్ కాలేజీల నిర్మాణానికి టెండర్లు పిలిచిన ఏపీఐఐసి.

    అమరావతి, సెప్టెంబర్ 12: విద్యార్దులకు మంచి భవిష్యత్ కావాలంటే చదువుతోపాటు వారిలో నైపుణ్యం అవసరం. ఆ నైపుణ్యం లేక అనేక పరిశ్రమలలో ఖాళీలు ఉన్నప్పటికీ, బయటి రాష్ట్రాల వారు వచ్చి ఆయా పరిశ్రమలలో పనిచేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో గడిచిన దశాబ్ధాలలో అనేక మంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చి రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాం కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.