SPREAD NEWS;- రఘురామకృష్ణంరాజు జగన్ మీద సిబిఐ కోర్టు లో జగన్ బెయిల్ రద్దు చేయాలని ఆ కేసును విచారణ వేగవంతం చేయాలని కేసు వేసిన సంగతి తెలిసిందే. ఇది ఆరు నెలలు విచారణ జరిగి, ఈ రోజు కోర్టు తీర్పు నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు నిన్న తెలంగాణ హైకోర్టు లోసిబిఐ కోర్టు మీద నాకు నమ్మకం లేదని. తీర్పుఆపి ఇంకొక కోర్టుకి కేసును బదిలీ చేయాలని కేసు వేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు ఉదయం తెలంగాణ హైకోర్టు ఆ కేసును కొట్టి వేస్తూ రఘురామకృష్ణంరాజు మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా మధ్యాహ్నం జగన్ బెయిల్ రద్దు చేయాలని కేసును కొట్టివేసింది సిబిఐ కోర్టు. జగన్ బెయిల్ రద్దుకు కారణాలు లేవని చెప్పింది. దీంతో రఘురామకృష్ణం రాజు కు డబల్ షాక్ తగిలింది.