SPREAD NEWS;- ఆఫ్గాన్ లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయా,ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తాలిబాన్లు వీలైనంత త్వరగా పరిస్థితులు అనుకూలంగా మారిస్తే చాలు అని కొందరు అనుకుంటూ ఉండగా, మరి కొంత మంది ప్రజలకు గందరగోళ పరిస్థితుల మధ్య దేశాన్ని దాటి వెళ్లాలని అన్ని దారులను వెతుకుతున్నారు. కానీ మా దేశం సురక్షితంగా ఉంటుందని ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని ప్రజలను కోరుతూ ఉన్నారు తాలిబాన్లు. అంతేకాకుండా దాదాపు ఆరు విమానాలను కదలకుండా ఆపుతున్నారు ఇంకా చిక్కుకుపోయిన అమెరికాతో సహా ఇతర దేశాల పౌరులు, బలగాలను, తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. మధు ఏషరీఫ్, నుంచి వందలాది శరణార్థులు తరలించేందుకు ఆరు విమానాలను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఆ విమానాన్ని తాలిబాన్లు అడ్డుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. దాదాపు వెయ్యి మంది విమానాశ్రయంలో గడిపి విధిలేక వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. తాలిబన్లు మహిళలపై ఎన్నోఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. మహిళలకు కూడా అన్నిటిలో తమకు అవకాశాలు కల్పించాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పట్టణాలలో వేల మంది మహిళలు తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.