ఖబడ్డార్ కామెడీ కల్యాన్.

         


 (SPREAD NEWS);-ఓటుకు నోటు కేసులో బేరమాడుతూ నీ పార్టనర్ చంద్రబాబు అడ్డంగా దొరికితే, అది సున్నితమైన కేసు.  నేను, మాట్లాడనని తప్పించుకున్నావ్, అమరావతిలో బాబుగారి బినామీలు 4 వేల ఎకరాలు కొనుక్కున్న విషయం పై కిక్కురుమనకుండా పోయావు.టీడీపీ మాజీ మంత్రులు అచ్చన్న, కొల్లు రవీంద్ర లు మందుల కుంభకోణంలో ఒకడు, మర్డర్ కేసులో మరొకడు జైలుకు వెళ్లినా కనీసం నువ్వు నోరు ఎత్త లేకపోయావు.చంద్రబాబు తన ప్రచార పిచ్చితో, పుష్కరాలలో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరిపి 29 మంది భక్తుల మరణానికి కారణమైన విషయంపై కూడా ,నువ్వు నోరు ఎత్తలేక పోయావు.

    విజయవాడ నడిబొడ్డున డాక్టర్ రమేష్ చౌదరి ఆసుపత్రిలో పదిమంది మరణించిన సంఘటనపై నోరెత్తకుండా మూసుకొని ఉన్నావు.విశాఖలో టీడీపీ నేతలైన భరత్ చౌదరి,హర్షవర్దన్ చౌదరి, వెలగపూడి చౌదరిల భూకబ్జాలు వరుసగా వెలుగులోకి వచ్చినా సరే ,నువ్వు నోరెత్తి వారిని ప్రశ్నించలేకపోయావ్.అలాగే బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసిన టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి చౌదరి ,సుజనా చౌదరి...లగడపాటి చౌదరిల లీలలపై నోరెత్తలేకపోతున్నావ్.

     టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ చౌదరి కి చెందిన అమర రాజా కంపెనీ చేసిన భూ కబ్జాలపై నువ్వు నోరు ఎత్తలేక పోయావు.విద్యుత్ ఒప్పందాల పేరుతో బయట మార్కెట్లో తక్కువ ధరకు యూనిట్ లభిస్తున్నా,వాటిని కాదని చంద్రబాబు తన బినామీలకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్దలనుండి  రెట్టింపు ధరలకు కొనుగోలు చేస్తూ, వారికి వేల కోట్ల ప్రజాధనాన్ని దోచి పెట్టి , 60 వేల కోట్ల భారాన్ని జనం పై రుద్దిన  విషయం పై నువ్వు ప్రశ్నించలేకపోతున్నావ్ఫైబర్ నెట్ కుంభకోణంలో లోకేష్ సన్నిహితుడు రెండు వేల కోట్లు కుంభకోణం చేస్తే ..దానిపై కూడా నువ్వు కిక్కురుమనలేక పోయావు.

    అనుక్షణం నువ్వు బాబుకు ఊడిగం చేయడంలోనే తరిస్తున్నావు కాబట్టే... నువ్వు రాజకీయాలలోకి వచ్చి పదేళ్లయినా,కనీసం అసెంబ్లీ గేటును కూడా తాకలేకపోయావ్.సినీ పరిశ్రమ నుండి వచ్చినటువంటి చిన్న చిన్న కామెడీ నటులైన శివ ప్రసాద్, బాబు మోహన్ వంటి వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా రాణించారు.నీ పార్టీ తరపున గెలిచిన ఏకైక సభ్యుడు రాపాక కూడా నిన్ను చీ కొట్టాడు.రాజకీయాల్లో కేవలం ఐటెం పాత్ర పోషిస్తూ నలుగురిలో నవ్వులపాలవుతున్నావనే సంగతిని ఇప్పటికైనా తెలుసుకో.