గులాబ్‌ పాను, అనంతర పరిస్ధితుతులు

     


 SPREAD NEW(అమరావతి);‍ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 80–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.మిగలిన చోట్ల అంత తీవ్రత లేదు.అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయి, వాటిని తొలగించాం.జాతీయ రహదారితో పాటు ప్రధాన మార్గాల్లో రవాణాకు ఎక్కడా ఆటంకం లేదు.ఆధికారులు అంతా క్షేత్రస్దాయిలో ఉన్నారు.అవసరతమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం.విశాఖ నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశాం.లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాం : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌.

తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికార్లకు సీఎం నిర్దేశం.

     వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి: అధికారులకు సీఎం ఆదేశం.ప్రతి అరగంటకూ విద్యుత్‌ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చుకోవాలి.ఆమేరకు వెంటనే చర్యలు తీసుకుని, విద్యుత్‌ను పునరుద్ధరించాలికలెక్టర్లు ఈ మేరకు సత్వరమే చర్యలు తీసుకోవాలి.ఇవాళ కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎస్‌కు ఆదేశం.

    మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఇవ్వాలని సీఎం ఆదేశం.బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం ఆదేశం.బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయొద్దన్న సీఎం.సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యతతో కూడి ఉండాలి :  సీఎం ఆదేశం.మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలన్న సీఎం



.