SPREAD NEWS(నెల్లూరు);- క్షేత్రస్థాయిలో 17వ డివిజన్ పార్టీ కార్యకర్తలు మరియు బూత్ కమిటీ సభ్యులతో నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది.
కార్యకర్త అంటే పార్టీకోసం, నాయకుడికోసం నిరంతరం కష్టం చేసేవాడు. తన కుటుంబాన్ని కుడా పక్కనపెట్టి, తాను నమ్ముకున్న నాయకుడు బలోపేతం చెందాలని, తాను నమ్మినపార్టీ పైకి రావాలిఅని, కష్టం చేసేవాడే కార్యకర్త. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
కార్యకర్త సంతోషంగా ఉంటేనే ఆ పార్టీకాని, నాయకుడుకాని బాగుంటారని, కార్యకర్త కన్నీరు కారిస్తే ఆ పార్టీ కానీ, నాయకుడుకికానీ మనుగడ ఉండదు. ప్రజలమధ్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కార్యక్రమాల సాధనకోసం పనిచేసేవాడే కార్యకర్త. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
నా రాజకీయ జీవితాన్ని నేను ఒక రాజకీయ కార్యకర్తగా ప్రారంభించాను కాబట్టి, కార్యకర్త కష్టం, విలువ, ఆకాంక్ష ఏంటో తెలిసిన వ్యక్తిలో నేను ఒకడిని. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
నిరంతరం ప్రజాసమస్యలతో, ప్రజా సంక్షేమంతోపాటు కార్యకర్తల సంక్షేమంకోసం క్షేత్రస్థాయిలో వారి స్థితిగతులను తెలుసుకొని, వారికి మరింత తోడుగా ఉండడమే నా కర్తవ్యం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.