SPREAD NEWS( నెల్లూరు);- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు "వై.యస్.ఆర్.జగనన్న కాలనీ"లో నూతనంగా నిర్మించిన ఇళ్లను ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన 14ఏళ్లుగా బాడుగ ఇళ్లలో ఉన్న తమకు ఇళ్ల స్థలం ఇచ్చి, ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించి, తమ సొంతింటి కల నెరవేరిందంటూ, భావోద్వేగంతో, ఎనలేని సంతోషంతో చెమ్మగిల్లిన కళ్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసిన వీరబాబు దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు.
వై.యస్.ఆర్.జగనన్న కాలనీలో గృహ ప్రవేశం సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని వీరబాబు దంపతులకు నూతన వస్త్రాలు బహూకరించిన ఎమ్మెల్యే కాకాణి.
నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిగా ముత్తుకూరు మండల కేంద్రంలో వైయస్సార్ జగనన్న కాలనీలో నూతనంగా నిర్మించిన గృహాన్ని ప్రారంభించాం.
నెల్లూరు జిల్లాలోనే ఇళ్ల నిర్మాణంలో ముత్తుకూరు మండలం ప్రథమ స్థానంలో ఉండటం సంతోషం.
వైయస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతుంది.
పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు అధికారులు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు అందించడంతో పాటు, అర్హులైన కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేశారు.
పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.