SPREAD NEWS(అమరావతి);- రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటేదురదృష్టవశాత్తూ ఒక్క చంద్రబాబుతోనే కాదు పచ్చమీడియాతోనూ మనం యుద్ధం చేస్తున్నాం.ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు లేకపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు.అందుకనే ప్రతి విషయంలో వక్రీకరణలు చేస్తున్నారు.ఇవన్నీ ఉన్నాకూడా, నెగెటివ్ ఉద్దేశంతో ప్రచారం చేసినా.. మనం చేయాల్సిన పనులు చేద్దాం.మనం బాగు చేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే దీనికి సాక్ష్యాలుగా నిలబడతాయి.
రోడ్లు
అక్టోబరు మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయి,తర్వాత పనుల కాలం మొదలవుతుంది,ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టండి.మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలి.మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం.గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారు.మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా పడ్డాయి.వర్షాలు పడ్డం వల్ల మరోవైపు రోడ్లు కూడా దెబ్బతిన్నాయి.రోడ్లను బాగుచేయడనికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.ఒక నిధిని కూడా ఏర్పాటు చేసింది.
పోర్టులు
రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తిచేస్తామన్న అధికారులు.మొదటివిడతలో నాలుగుబెర్తులు.తొలివిడతలో రూ. 2647 కోట్లు నిర్మాణంకోసం ఖర్చు.అక్టోబరు 1 నుంచి రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం.వచ్చే మే నాటికి కీలకమైన పనులు పూర్తిచేస్తామన్న అధికారులు.అక్టోబరు చివరి నాటికి భావనపాడు పోర్టుకు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్న అధికారులు.మొదటి విడతకు రూ.2956 కోట్ల ఖర్చు.మచిలీపట్నం పోర్టుమొదటి విడతలో రూ. 3650 కోట్ల ఖర్చుతో30 నెలల్లోగా పనులు పూర్తిచేస్తామన్న అధికారులు.
విమానాశ్రయాలు
భోగాపురంలో ఎయిర్‌పోర్టును వీలైనంత త్వరగా నిర్మాణం ప్రారంభించడానికి అన్నిచర్యలూ తీసుకోవాలన్న సీఎం.మిగిలిన ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపనులపై సమీక్షచేయాలని సీఎం ఆదేశం.కర్నూల, కడపల నుంచి విశాఖపట్నానికి విమాన సౌకర్యాన్ని పెంచేదిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం.విశాఖపట్నం, తిరుపతి ఎయిర్‌పోర్టులనుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీని అభివృద్ధిచేయాలన్న సీఎం .
మొదటి విడతలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె వద్ద మొదటి విడతలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ల నిర్మాణప్రగతిపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు.వచ్చే ఏడాది మే – జూన్‌నాటికి మొదటి ఫేజ్ హార్బర్లను పూర్తిచేస్తున్నామన్న అధికారులు
రెండో విడతలో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, కొత్తపట్నం, వాడరేవుల వద్ద పిషింగ్ హార్బర్ల నిర్మాణం.