SPREAD NEWS;-సామాన్యుల కార్యకర్తల నివాసంలోనే భోజనం
స్థానిక సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై అధ్యయనం
42 రోజుల పాటు 3516 మంది కార్యకర్తల కుటుంబాలతో భేటీ
ప్రతి కార్యకర్త గడప తొక్కుతారూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్ని కష్టాలు వచ్చిన ఎన్నో ఏళ్లుగా నమ్ముకుని ఉన్న కార్యకర్తలను పలుకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు నేను- నా కార్యకర్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అపోలో హాస్పిటల్ వద్ద నున్న రాము అనే వైసీపీ కార్యకర్త నివాసం నుంచి నేను - నా కార్యకర్త కార్యక్రమానికి సంబంధించి పాదయాత్ర గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 రోజుల పాటు 3516 మంది కార్యకర్తల కుటుంబాలతో భేటీ అవుతున్నట్లు తెలిపారు. వారి కష్టనష్టాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును క్షేత్ర స్థాయిలో తెలుసుకోనున్నామన్నారు.
మధ్యాహ్నం ఓ సామాన్యకార్యకర్త నివాసంలోనే భోజనం చేస్తానని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పాదయాత్ర సాగుతుందని ఆయన వివరించారు. కార్యకర్తలు బాగుంటేనే తాను బాగుంటానని కార్యకర్తల కష్టం తనకు తెలుసని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు.